దొంగ ఓట్లు చేర్చడంపై ఈసీకి ఫిర్యాదు..: విజయసాయిరెడ్డి

టీడీపీ దొంగ ఓట్లు చేర్చడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఈసీని కలిశామన్న ఆయన టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.

ఇమేజ్ రూపంలో ఉన్న ఈసీ డేటాను ఎక్సల్ కు మార్చి వివరాలు సేకరించారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు రెండు లక్షల కుటుంబాల వ్యక్తిగత డేటాను టీడీపీ సేకరించిందని తెలిపారు.

Complaint To EC On Inclusion Of Stolen Votes..: Vijayasai Reddy-దొంగ ఓ

ఇది చట్ట విరుద్ధమని ఈసీకి తెలియజేశామన్నారు.ఓటర్ల డేటా అంతా అమెరికా సర్వర్లలో స్టోర్ చేశారని పేర్కొన్నారు.

రెండు చోట్ల ఓట్లను కలిగి ఉండటంపైనా ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.తమ విజ్ఞాపనల పట్ల ఈసీ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు.

Advertisement
పవిత్రమైన ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే... లక్ష్మీకటాక్షం కలుగుతుంది?

తాజా వార్తలు