మోడీపై తెలుగు పత్రికల్లో విమర్శ

చంద్రబాబు అయన మంత్రులు కేంద్రం పై గాని, మోదిపైగాని విమర్శలు గుప్పించాలంటే అందుకు ఇంగ్లీష్ పత్రికల్లో రానివిధంగా తెలుగు పత్రికలకే పరిమితం అవుతున్నారు.

ఆ జాగ్రత్తలు బహువిధాలుగా తీసుకుంటున్నారు .

బాబు కు ఇంగ్లీష్ రాదంటే రాదనీ చెప్పలేము .ఆయన ఇంగ్లీష్ మాట్లాడగలరు.కాని మోడిని విమర్శిస్తే లేనిపోని రిస్కు అని భయపడుతున్నారు.

వాస్తవానికి మోడీ దృష్టిలో తెలుగు పత్రికలు రావు.ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకు రాలేక పోతున్నారు.

ప్రత్యెక హోదా అంటే కేంద్రం కంటే బాబే భయపడుతున్నారు.వాస్తవానికి జగన్ తన మీడియాలో నాడు సోనియా ఇటలీ జీవితం పై ఏదేదో రాసేస్తే ఆమె దృష్టికి రాకుండా పోయింది .అప్పుడు కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఈ తెలుగు పత్రిక లో రాతను అక్కడ ఢిల్లీ టాబ్లాయిడ్ లో ఇంగ్లీష్ అనువాదం చేయించి స్వయముగా సోనియాకి అందించడమే కాకుండా చదివేవరకు ఆ ఇంటి గుమ్మం దిగలేదు .దాంతో ఆమె మండి పడ్డారు.సిబిఐని అన్నిపనులు మానుకుని జగన్ పనిపట్టమని పంపారు .ఆ నొప్పి తెలుసుకున్న జగన్ కు ఇంగ్లీష్ పత్రిక కారణంగా ఎలాంటి అనర్ధాలు వస్తాయో తెలుసు.అందుకే ప్రత్యర్ధిపై ఇలాంటి విమర్శలకు దిగారు అని రాజకీయ పరిశీలకులకు ఇట్టే అర్ధమై పోతుంది.

Advertisement
కొండగట్టు ఆలయంలో జై కేసీఆర్ నినాదాలు చేసిన స్వాములు

తాజా వార్తలు