Ali Shehyaz : కమెడియన్ ఆలీ అల్లుడు ఏం చేస్తాడు? ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో కమెడియన్ గా కొన్ని వందల సినిమాలలో నటించి తనదైన కామెడీ టైంమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అలీ.

ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ,మరోవైపు అలీతో సరదాగా అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు అలీ.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా అలీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం అలీ పెద్ద కుమార్తె వివాహం.

కూతురి కుమార్తె వివాహం కారణంగా ఆలీ స్టార్ సెలబ్రిటీతోపాటు రాజకీయ నాయకులకు అలాగే ఏపీ సీఎం జగన్, కెసిఆర్ లాంటి వాళ్ళని సైతం కలిసి పెళ్లికి ఇన్వైట్ చేశాడు.కాగా తాజాగా అలీ పెద్ద కూతురి పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

అలీ పెద్ద కుమార్తె ఫాతిమా నిఖా(పెళ్లి) తాజాగా హైదరాబాద్ లో ఆదివారం గ్రాండ్ గా జరిగింది.కాగా ఈ పెళ్లికార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆలీకి కాబోయే అల్లుడు ఏం పని చేస్తాడు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే అలీ కి కాబోయే అల్లుడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవల డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసి అలీ కుటుంబంలో మొదటి డాక్టర్ అయింది.అలీ అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టరే కావడం విశేషం.

జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహ్యాజ్.షెహ్యాజ్ కు ఒక అన్నయ్య, ఒక సోదరి కూడా ఉన్నారు.

కాగా షెహ్యాజ్ వదిన కూడా డాక్టరే.అయితే షెహ్యాజ్ గుంటూరుకు చెందిన వారు అయినప్పటికీ, వారంతా కలిసి లండన్ లో ఉంటున్నారు.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!

షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత కుటుంబం.ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో షెహ్యాజ్ కూడా ఎంతో కష్టపడి డాక్టర్ చదివాడట.

Advertisement

ఇక కూతురు డాక్టర్ చదివేసరికి అల్లుడిని కూడా డాక్టరే కావాలని ఏరికోరి మరి షెహ్యాజ్ ని ఎంపిక చేసుకున్నారట అలీ.  ఇకపోతే అలీ అల్లుడు సంపాదన విషయానికి వస్తే.ఏడాదికి దాదాపుగా రెండు కోట్లకు వరకు సంపాదిస్తాడు అని అలీ సన్నిహితుల నుంచి సమాచారం.

తాజా వార్తలు