పవన్ తో ఆలీ భేటీ ! రెండు గంటల పాటు చర్చలు

గత కొద్ది రోజులుగా.సినీ కమెడియన్ అలీ ప్రస్తావన తరుచూ వార్తల్లోకి వస్తుంది.

ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా అందరిని సస్పెన్స్ కి గురి చేస్తూ.అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ.

అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.మొన్నామధ్య వైసీపీ అధినేతను కలవగా .ఆ తరువాత చంద్రబాబు నాయుడుని కలిసి చర్చలు జరిపారు.అలాగే నిన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ని కలిశారు.

ఆయన టీడీపీ తరపున గుంటూరు టికెట్ ఆశిస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే.ఈ రోజు తన మిత్రుడైన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు.జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు.

ఆలీని వెంటబెట్టుకుని అమరావతిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.వైసీపీలో ఈ నెల 9వ తేదీన ఆలీ చేరబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తన స్నేహితుడు, గురువు, మార్గదర్శకుడిగా పవన్‌ను చెప్పుకునే అలీ.ఆయన సలహాలు తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది.దాదాపు 2 గంటలపాటు పాటు వీరి భేటీ కొనసాగింది.

అయితే వారిద్దరూ ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?
Advertisement

తాజా వార్తలు