టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌రువు పాయే

ఐఏఎస్ అధికారులంటే ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో ఉండేవారు కాద‌ని నిరూపించారు కరీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ స‌ర్ప‌రాజ్‌! ప్రభుత్వ పెద్దల సాక్షిగానే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

ఫ్లెక్సీలో త‌న ఫొటో ఎందుకు పెట్ట‌లేద‌ని త‌న‌తో వాద‌న‌కు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

వేలు చూపిస్తూ.ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ కొట్టేంత‌గా రెచ్చిపోయారు.

Collector Strong Counter To TRS MLA-Collector Strong Counter To TRS MLA-Telugu P

క‌లెక్ట‌ర్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఒక్క‌సారిగా ఎమ్మెల్యే అవాక్క‌య్యారు.`నువ్వు రెండంటే నేను నాలుగంటా` అనే రేంజ్‌లో క‌లెక్ట‌ర్ దూసుకొస్తుండ‌టంతో ఇక ఎమ్మెల్యేకు బుర్ర తిరిగిపోయింది.

నిన్న గాక మొన్నవైసీపీ అధినేత జ‌గ‌న్ ఓ జిల్లా క‌లెక్ట‌ర్ తో గొడ‌వ‌ప‌డితే తాజాగా తెలంగాణ‌లో ఓ ఎమ్మెల్యే క‌లెక్ట‌ర్ తో వాగ్వాదానికి దిగారు.ఇదే ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Advertisement

ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది.కరీంనగర్ లో డిజీ ధనమేళా జరిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌, మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పాల్గొన్నారు.అయితే వేదిక‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ‌ ఫోటోలు ఎందుకు పెట్టలేద‌ని సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాలకిష‌న్, మ‌రో ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ రచ్చ రచ్చ చేశారు.

చివ‌ర‌కు వేదికపైకి వెళ్లారు.అక్క‌డ‌కు వెళ్ల‌గానే అస‌లు సీన్ మొద‌లైంది.

ఫ్లెక్సీలో ఫోటో ఎందుకు పెట్ట‌లేదంటూ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మ‌ద్ తో రసమయి వాగ్వాదానికి దిగారు.`మిస్టర్ కలెక్టర్.

` అంటూ ఏదో అనబోయారు.ఇంతలోనే కలెక్టర్ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

Advertisement

‘మీరు నన్ను అడగద్దు` అంటూ వేలు చూపిస్తూ.తీవ్రస్వరంతో వాదించారు.

కలెక్టర్ నుంచి ఊహించని స్పందన రావడంతో రసమయికి కోపం కట్టలు తెంచుకుంది.మరింత ఆగ్రహానికి గురైన ఆయన… `నాకే వేలు చూపిస్తావా` అంటూ మండిపడ్డారు.

అయితే అక్క‌డి నేత‌లు వెంట‌నే.ర‌స‌మ‌యిని ప‌క్కకు తీసుకొచ్చారు.

అయితే కలెక్టర్ తీరుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.నిజానికి ఫ్లెక్సీపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ఫోటోలు పెట్టారు.

అయితే ప్రొటోకాల్ ప్రకారం.ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు కూడా పెట్టాలని రసమయి వాదించారు.

ఫోటోల కోసం ఆయ‌న ఇంత రాద్ధాంతం చేయ‌డంతో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి ఈటల రాజేందర్ ఈ సీన్ చూసి అవాక్కయ్యారు.అయితే ఈ విష‌యంపై ఫిర్యాదు చేసేందుకు వేరే ప‌ద్ధ‌తి ఉంద‌ని.

ఇలా కాకుండా క‌లెక్ట‌ర్‌పై విరుచుకుప‌డితే ఏం లాభం?? .

తాజా వార్తలు