Dharani : నేడు ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ధరణిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.ఈ మేరకు ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

ధరణి పేరును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూమాత( Bhumatha )’ గా మార్చనుంది.ముందుగా జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

తరువాత భూమాత పేరు మార్పుతో పాటు సైట్ ను సరళీకరించడంపై ఆయన ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.మరోవైపు ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ తయారు చేసిన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

Dharani : నేడు ధరణిపై సీఎం రేవంత్ రె

వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూముల వివరాలతో ఈ మధ్యంతర నివేదికను కమిటీ రూపొందించిందని సమాచారం.అలాగే ధరణి పోర్టల్ వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రజలు, రైతులు ( Farmers )ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలను కమిటీ గుర్తించింది.అయితే ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోనున్న చర్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

Advertisement
Dharani : నేడు ధరణిపై సీఎం రేవంత్ రె
జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!

తాజా వార్తలు