CM Revanth Reddy : చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి( Ranjith Reddy)తో పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలు మరియు ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు హాజరుకానున్నారు.

ఇందులో ప్రధానంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దిశానిర్దేశం చేయనున్నారు.

దాంతో పాటుగా ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుందన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలో సభా ఏర్పాట్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )నేతలకు పలు సూచనలు చేయనున్నారని సమాచారం.

డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!
Advertisement

తాజా వార్తలు