CM Revanth Reddy KCR : కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు( KCR ) సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఛాలెంజ్ విసిరారు.

కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానన్న రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులపై( Irrigation Projects ) రెండు ప్రత్యేకంగా రెండు రోజులపాటు ప్రత్యేకంగా చర్చిద్దామని వెల్లడించారు.ఈ చర్చకు కేసీఆర్ తప్పకుండా హాజరుకావాలని సూచించారు.

చర్చలో భాగంగా కేసీఆర్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.

చర్చిలో తనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) మాట్లాడతామన్న రేవంత్ రెడ్డి చర్చ జరిగినంతసేపు కేసీఆర్ అసెంబ్లీలోనే ఉండాలని తెలిపారు.60 ఏళ్లలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు.అలాగే ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు