Congress CM Revanth Reddy : 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

మహబూబ్ నగర్ "ప్రజా దీవెన" సభ( Praja Deevena )లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వాన్ని కులదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు.

పదేళ్లు పాలించిన వారు రెండు నెలలకు ప్రభుత్వం కూలగొడతామని అంటున్నారు అంటూ మండిపడ్డారు.ఇదే సమయంలో ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందన్నారు.

పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడమే బీఆర్ఎస్( BRS ) విధానమా అని ప్రశ్నించారు.అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి మంచిది కాదని పేర్కొన్నారు.

మన వద్దకు అతిథి వస్తే గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.ప్రధానిని సహకరించమని కోరడంలో తప్పేముందని అన్నారు.

Advertisement
Cm Revanth Reddy Seriousl Comments On Kcr-Congress CM Revanth Reddy : 2034 వ�

భవిష్యత్తులో ప్రధాని గనుక సహకరించకపోతే చాకిరేవు పెడతానని హెచ్చరించారు.

Cm Revanth Reddy Seriousl Comments On Kcr

దేశంలో మోడీతో అయిన రాష్ట్రంలో కేడితోనైనా కొట్లాడుతా.మనమిచ్చే మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలని మాత్రమే అన్నారు.పదేళ్లు గడిచిన పాలమూరు ప్రాజెక్టు( Palamuru Project )కు మోదీ జాతీయ హోదా ఇవ్వలేదు.

మోదీ, కేడీలు కలిసి ఎస్సీలకు అన్యాయం చేశారు.మా మంచితనం చేతగానితనం అనుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు.తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పష్టం చేశారు.1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి.కేసీఆర్( KCR ) ఇంట్లో పడుకుంటే కుటుంబ సభ్యులు ఆయనను లేపి టీవీ  చూపించండి.

పాలమూరు సభ సాక్షిగా చెబుతున్నా కేసీఆర్.నా పార్టీ కార్యకర్తల మీద ఆన.2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు