నేడు ఢిల్లీకి రేవంత్... ఆ పదవుల భర్తీపై రానున్న క్లారిటీ

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పార్టీలోను,  ప్రభుత్వంలోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా వ్యవహరించడమే కాకుండా, అందరివాడి గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఢిల్లీ అధిష్టానం పెద్దలకు తనపై బలమైన నమ్మకం ఏర్పడేలా చేసుకున్నారు.ఇక తెలంగాణలో పార్టీకి,  ప్రభుత్వానికి సంబంధించి గత కొంతకాలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ వస్తున్నారు.

దీంతోపాటు,  తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విషయంలోనూ అనుకున్న మేరకు సక్సెస్ అవుతున్నారు.ఇదిలా ఉంటే శ్రావణమాసం ముగియనుండడంతో  నామినేటెడ్ పోస్టుల భర్తీ , అలాగే ముఖ్యమైన నామినేటెడ్ పదవుల కు ఎవరిని ఎంపిక చేయాలి తదితర అంశాలపై చర్చించేందుకు నేడు ఢిల్లీకి( Delhi ) వెళ్లి అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు.

ఈ అంశాలతో పాటు,  తెలంగాణ కాంగ్రెస్ కు( Telangana Congress ) కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలోనూ పార్టీ అగ్రనేతలతో రేవంత్ చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.వాస్తవంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష స్థానాన్ని వేరొకరికి కేటాయించాలని , ముఖ్యమంత్రిగాను , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగాను రెండు పదవులకు సరైన న్యాయం చేయలేనని,

Advertisement

వేరొకరికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వాలంటూ రేవంత్ అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నారు.అయితే ఏదో ఒక విషయంలో ఆటంకం ఏర్పడుతూ ఈ నిర్ణయాన్ని అధిష్టానం పెద్దలు వాయిదా వేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంతో పాటు,  కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక పైన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించి ఒక క్లారిటీకి రావాలని రేవంత్ భావిస్తున్నారట.

దీంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు హైదరాబాదుకు రావలసిందిగా రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించునున్నట్లు సమాచారం.

శ్రావణమాసం ఎఫెక్ట్ .. టి. కాంగ్రెస్ లో చేరికలు షురూ
Advertisement

తాజా వార్తలు