CM Revanth Reddy : నల్గొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో( Telangana assembly election ) ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారి బహిరంగ సభలో కేసిఆర్ ( KCR )పాల్గొన్నారు.

మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ జల శంఖారావం సభ నిర్వహించడం జరిగింది.

ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేసీఆర్ మండిపడ్డారు.ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీలో పోరాటం చేయాలని సూచించారు.కృష్ణా జలాలలో మన వాటా పై స్పష్టత వచ్చేవరకు పోరాడాలని పేర్కొన్నారు.

Cm Revanth Reddy Counter To Kcr Comments In Nalgonda Meeting

తన తుది శ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని పులిలా లేచి కొట్లాడుతానే తప్ప పిల్లిలా ఉండనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.తమ ప్రభుత్వం వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే నల్గొండ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.

Advertisement
Cm Revanth Reddy Counter To Kcr Comments In Nalgonda Meeting-CM Revanth Reddy :

చావు నోట్లో తలపెట్టానని ఇంకెన్నాళ్లు చెబుతారు.? అసెంబ్లీలో మీ అవినీతిపై చర్చ పెట్టాం.మీరు సత్యహరిశ్చంద్రుడు, నిజాయితీపరుడైతే వచ్చి మాట్లాడాలి.

కాలు విరిగిందని సభకు రాని కేసీఆర్.నల్గొండ సభకు ఎలా వెళ్లారని నిలదీశారు.

ఆయన సానుభూతితో ఓట్లు పొందాలని ఆశిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్ నల్గొండ సభలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తామని హెచ్చరించారు.

నల్లటి వలయాలతో వర్రీ వద్దు.. విటమిన్ ఈ ఆయిల్ తో వారం రోజుల్లో వాటికి బై బై చెప్పండి!
Advertisement

తాజా వార్తలు