టాలీవుడ్ తీరు పై రేవంత్ ఆగ్రహం ? ఏం చేయబోతున్నారు 

బిజెపి ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ మంత్రి కొండ సురేఖ( Minister Konda Surekha ) మెడలో నూలు దండ వేయడాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేయడం , దీనిపై కొండ సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ,  బీఆర్ఎస్ పెద్దలపై ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన( KTR ) విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

తనను ట్రోల్ చేశారన్న ఆగ్రహంతో కొండ సురేఖ అతిగా స్పందించి , ఈ వ్యవహారం తో సంబంధం లేని సినీ హీరో నాగార్జున( Nagarjuna ) కుటుంబం పైన ఆరోపణలు చేశారు.

అయితే ఆ విమర్శలు పై కొండా సురేఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో , ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.అయితే ఈ విషయంలో నాగార్జున కొండ సురేఖ పై పరువు నష్టం దావా వేశారు.

Cm Revanth Reddy Angry On Tollywood Industry Details, Konda Surekha, Samantha, K

ఈ వ్యవహారం ఇలా ఉంటే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) పిలుపునిచ్చారు.అయినా ఈ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది  స్పందిస్తున్నారు.కొండ సురేఖ తాను చేసిన తప్పు ను గుర్తించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పినా,  సినీ ప్రముఖులు ఈ వ్యవహారంపై పదే పదే స్పందిస్తుండడం వంటివి కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో టాలీవుడ్ కు చెందిన వారు సైలెంట్ గానే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అతిగా స్పందిస్తుండడం వంటివి రేవంత్ రెడ్డి తో( CM Revanth Reddy ) పాటు కాంగ్రెస్ ప్రముఖులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.

Cm Revanth Reddy Angry On Tollywood Industry Details, Konda Surekha, Samantha, K
Advertisement
Cm Revanth Reddy Angry On Tollywood Industry Details, Konda Surekha, Samantha, K

ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి చేసినా టాలీవుడ్ ప్రముఖులు ఈ వ్యవహారంపై స్పందిస్తూనే ఉండడం పై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నారట.  గద్దర్ అవార్డులు విషయంలో టాలీవుడ్ ప్రముఖులు ఎవరు కలిసి రావడం లేదు కానీ , టికెట్ల రేట్ల పెంపు ఇతర ప్రయోజనాలు విషయంలో మాత్రం ప్రభుత్వం వద్దకు పదేపదే వస్తున్నారని,  ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే ముందుంటున్నారని రేవంత్ అభిప్రాయపడుతున్నారట .అందుకే టాలీవుడ్ విషయంలో ఇకపై సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని , కఠినంగానే వ్యవహరించాలనే ఆలోచనతో ఉన్నారట.అయితే స్పందన లేకపోవడం , లేక పోతే అతిగా స్పందించడం వంటి వ్యవహారాలు రేవంత్ కు నచ్చడం లేదట.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు