సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవనంతో పాటు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించనున్నారు.అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు సమీకృత వెజ్ -నాన్ వెజ్ మార్కెట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు.

అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

కాగా కేసీఆర్ ముందుగా ప్రగతిభవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.అక్కడ నుంచి హెలికాప్టర్ లో సూర్యాపేటకు చేరుకుంటారు.

Advertisement

రోడ్డు మార్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లనున్న కేసీఆర్ దాన్ని ముందుగా ప్రారంభించనున్నారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement