ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

ఈ మేరకు ఇల్లందు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ముందుగా మధ్యాహ్నం ఒంటి గంటకు సత్తుపల్లికి వెళ్లనున్న కేసీఆర్ నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లందు నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొననున్నారు.

మొదటి సారి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనతో నియోజకవర్గాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు