నేడు ఉమ్మడి నల్లొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగా కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.కోదాడ, తుంగతుర్తి మరియు ఆలేరులో బీఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరుకానున్నారు.ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కోదాడలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు తుంగతుర్తి సభకు, సాయంత్రం 4.30 గంటలకు ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు