ప్రొ.హరగోపాల్ పై కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం

ప్రొఫెసర్ హరగోపాల్ పై పెట్టిన దేశద్రోహం కేసు వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు ఇతరులపై ఉన్న UAPA కేసులు ఎత్తివేయాలని డీజీపీకి తెలిపారు.

ఆగస్ట్ 19, 2022న తాడ్వాయి పోలీసులు హరగోపాల్ పై దేశద్రోహం కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే.మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ UAPA, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు పది సెక్షన్ల కింద తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అయితే హరగోపాల్ పై కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ క్రమంలోనే హరగోపాల్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కేసీఆర్ ఆదేశించారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement