ఏపీ బీఆర్ఎస్ : ఖర్చులన్నీ మావే.. వచ్చేయండి వచ్చేయండి !?

జాతీయ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు.దేశవ్యాప్తంగా తమకు బలం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు .

వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను రచిస్తున్నారు.ముఖ్యంగా ఏపీ , కర్ణాటక నాగాలాండ్, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దీనిలో భాగంగానే చేరికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడం , మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సులభం అనే విషయాన్ని కెసిఆర్ గ్రహించారు.

అందుకే వీలైనంత తొందరగా పార్టీలో చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు.  మరి కొంత మంది మాజీ ఐఏఎస్ లు పార్టీలో చేరారు.

Advertisement

మిగతా పార్టీలోని అసంతృప్తి నాయకులు,  పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కక,  గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బీఆర్ఎస్ లో చేరుతారనే నమ్మకంతో కెసిఆర్ ఉన్నారట.ఇక పార్టీలో చేరే వారికి రకరకాల ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ నమ్ముతున్నారు.ఇక పార్టీలో చేరే వారికి,  చేరాలని చూస్తున్న వారికి రకరకాల ఆఫర్లను ఇస్తున్నారు.

అంతేకాకుండా పార్టీలో చేరే సమయంలో ను,  ఆ తరువాత ఖర్చులన్నీ భరిస్తున్నారట.ఇటీవల కేసీఆర్ సమక్షంలో పార్టీ జెండా కప్పుకున్న తోట చంద్రశేఖర్,  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, 

మిగతా రిటైర్డ్ ఐఏఎస్ లు తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లో భారీగానే ఫ్లెక్సీలు వెలిసాయట.వీటన్నిటిని పార్టీ ఖర్చుతోనే ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.దీంతోపాటు ఈ సందర్భంగా భారీగా వచ్చిన అనుచర గణానికి, ఖర్చులతో పాటు,  చేరేందుకు వచ్చే సమయంలో కార్లను సైతం పార్టీ ద్వారానే ఏర్పాటు చేశారట.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..

మీరు పార్టీలో చేరితే చాలు , మిగతా అన్ని సంగతులు తాము చూసుకుంటాము అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ .బీఆర్ఎస్ లో చేరికలను మరింతగా ప్రోత్సహిస్తున్నారట.ఈ రకమైన విధానం కొంతమంది తటస్థల్లోనూ , ఇతర పార్టీలో గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని బీఆర్ఎస్ వైపు దృష్టి పడే విధంగా చేస్తోందట.

Advertisement

తాజా వార్తలు