ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఈ మేరకు వరుసగా జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు.

ఇప్పటికే జనగామ, భువనగిరి సభల్లో పాల్గొన్న కేసీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న సభల్లో పాల్గొననున్నారు.ముందుగా సిరిసిల్లకు వెళ్లనున్న కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు హాజరుకానున్నారు.

అనంతరం సాయంత్రం సిద్దిపేటలో జరిగే సభలో పాల్గొననున్నారు.ఈ క్రమంలో రెండు సభలకు పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు