జగన్ సర్కార్ మద్యం రేట్లు పెంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.
పాపులర్ బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్ మద్యాన్ని అధిక ధరలకు అమ్మడం కూడా విమర్శలకు దారి తీసింది.
దాదాపు 30 రకాల కొత్త బ్రాండ్స్ మద్యాన్ని ప్రజలకు అంట గట్టారు.అంతకు ముందు ఈ బ్రాండ్స్ పేర్లు కూడా ఎవరూ విని ఉండరు.
ఇవన్నీ జగన్ అనుచరుల కంపెనీలలో తయారైనవే అనే ఆరోపణలు కూడా వినిపించాయి.విమర్శలు పెరగడంతో ప్రభుత్వం మద్యం ధరలు కొంత మేరకు తగ్గించింది.
అసలు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్ ఇపుడు ఆ మద్యం పై వస్తోన్న ఆదాయంపైనే ఆధారపడుతున్నారని విమర్శలు కూడా లేకపోలేదు.ఇవన్నీ విపక్షాలకు విమర్శించే అవకాశాలను ఇచ్చాయి.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేసింది.పులివెందులలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల, కడప రిమ్స్‌లో రూ.107 కోట్లతో కేన్సర్ ఆస్పత్రి, రూ.125 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ బ్లాకు, రూ.40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, పుష్పగిరి ఐ ఇన్సిట్యూట్‌లను నెలకొల్పారు.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి మరిన్ని మెరుగులుదిద్ది 7,41,147 కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వం మరి కొన్ని మెడికల్ కళాశాలలకు ప్లాన్ చేస్తోంది ఇక పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.రూ.30 వేల కోట్లతో కొప్పర్తి పారిశ్రామికవాడ, గోపవరం, పులివెందుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పుతోంది.ఇప్పటికే జమ్మలమడుగు వద్ద ఉక్కు పరిశ్రమకు శ్రీకారం చుట్టింది.పరిశ్రమల ఏర్పాటుతో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు, తద్వారా 5.20 లక్షలకు ఉపాధి లభిస్తోంది.గడిచిన మూడేళ్లలో 60 వేల క్వింటాళ్లకు పైగా సబ్సి డీ వేరుశనగ, పిల్లిపెసర, జనుము తదితర విత్తనాలను అందించిన ప్రభుత్వం 3 లక్షల టన్నులకు పైగా రసాయనిక ఎరువులను రైతులకు అందజేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy