CM Jagan PM Modi : ప్రత్యేక హోదా మరియు రైల్వే జోన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు.

జనాలు పోటెత్తారు.ఊహించని రీతిలో జనం రావడంతో విశాఖ నగరం మొత్తం పండగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా సభా వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోడీని ఉద్దేశించి మీతో మాకున్న బంధం రాజకీయాలకు .పార్టీలకు అతీతమైనది అని తెలిపారు.ఇక ఇదే సందర్భంలో విభజన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.8 సంవత్సరాల క్రితం విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద గాయం అయిందని స్పష్టం చేశారు.ఇంకా ఆ గాయం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దలు మరియు సహృదీయులు అయిన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సాయం, ప్రతి సంస్థ ఇచ్చే ప్రతి రూపాయి.

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి దోహదపడతాయి.ఈ సందర్భంగా పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం.

అని సీఎం జగన్ ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు