వైసిపి నియోజకవర్గ ఇంచార్జీల మార్పు ! రెండో లిస్ట్ లో ఉంది వీరేనా ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలో మార్పు వ్యవహారం పెద్ద సంచలనం సృష్టిస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ సర్వేలు చేయిస్తున్న జగన్.

( CM Jagan ) సర్వే రిపోర్ట్ లో ఆధారంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు.కచ్చితంగా గెలుస్తారు అనుకున్నవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

పనితీరు సక్రమంగా లేనివారు , ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారి లో తనకు అత్యంత సన్నిహితులు ఉన్నా.పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే 11మంది ఇన్చార్జిలను మార్చారు .అందులో మంత్రులు కూడా ఉన్నారు .ఇక రెండో జాబితా ను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.జగన్ ప్రకటించబోయే రెండో జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Cm Jagan Mohan Reddy Second List Of Ycp New Incharges Details, Ap Government, Ys
Advertisement
Cm Jagan Mohan Reddy Second List Of Ycp New Incharges Details, Ap Government, Ys

రెండు జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) అనకాపల్లి నుంచి యలమంచిలికి, కొవ్వూరు ఎమ్మెల్యే హోం మంత్రి తానేటి వనిత ను( Taneti Vanitha ) గోపాలపురానికి  మార్చబోతున్నారట.అలాగే మంత్రి , అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ కు ఈసారి అవకాశం దక్కే ఛాన్స్ లేదట.ఆస్థానం లో అమలాపురం ఎంపీ చింత అనురాధకు అవకాశం ఇవ్వనున్నారట.

ఇక మంత్రులు జోగి రమేష్ (పెడన ) అంబటి రాంబాబు (సత్తెనపల్లి) ని వేరే నియోజకవర్గం కు పంపబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.అలాగే ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం కు( Gummanuru Jayaram ) ఈసారి ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందట .పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీత ను ఇన్చార్జిగా , దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను మార్చనున్నారట.  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని లోక్ సభ కు పంపబోతున్నట్లు సమాచారం.

Cm Jagan Mohan Reddy Second List Of Ycp New Incharges Details, Ap Government, Ys

అలాగే సీట్ల మార్పు జాబితాలో పాల్గున (అరకు ఎస్టీ ), కన్నబాబు రాజు (యలమంచిలి ), గొల్ల బాబురావు ( పాయకరావుపేట ), పి.ఉమ శంకర్ గణేష్ ( నర్సీపట్నం ) , పర్వత పూర్ణ చందర్ ప్రసాద్ ( పత్తిపాడు), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట ), తలారి వెంకట్రావు (గోపాలపురం) రక్షణ నిధి (తిరువూరు),   సింహాద్రి రమేష్ బాబు (అవనిగడ్డ ), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్ ) లు ఉన్నారు.వీరితో పాటుగా కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు) వి .వరప్రసాదరావు (గూడూరు), ఆర్డర్ (నందికొట్కూరు), సుధాకర్ ( కోడుమూరు ), వై.బాలనాగిరెడ్డి ( మంత్రాలయం ) , వై.వెంకటరామిరెడ్డి ( గుంతకల్ ) , తిప్పే స్వామి (మడకశిర ), శ్రీధర్ రెడ్డి ( పుట్టపర్తి ) , కోనేటి ఆదిమూలం ( సత్య వేడు ), శ్రీనివాసులు (చిత్తూరు ), వెంకట గౌడ ( పలమనేరు )  ఈ మార్పు ల జాబితాలో ఉన్నట్టు గా ప్రచారం జరుగుతోంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు