పొత్తు లు కుదురుతున్నా సడలని జగన్ ధైర్యం వెనుక ఉన్నది వారేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేన తెలుగుదేశం పొత్తు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే.

సీట్ల కేటాయింపులో ఎన్నిమల్ల గుల్లాలు పడినా చివరికి కలిసే పోటీ చేస్తారని రెండు పార్టీల అభిమానులు, సాధారణ జనం కూడా ఫిక్స్ అయిపోయారు.

మరి వీళ్ళిద్దరూ కలిస్తే వైసీపీకి ( YCP ) ఓటమి తప్పదంటూ సర్వత్రా వినిపిస్తున్న అంచనాల మధ్య భయపడాల్సిన జగన్ లో ఈ ధైర్యానికి కారణం ఏమిటి?నిజానికి తెలుగుదేశం జనసేన పొత్తు( Janasena TDP ) కుదరకూడదని జగన్ ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నించింది.వీరిద్దరిని రకరకాలుగా విమర్శించి, ఒంటరిగా పోటీ చేయడానికి దమ్ము లేదంటూ హేళన చేస్తూ పొత్తు వికటించే ప్రయత్నాలు కూడా చేసింది.

వీరిద్దరి పొత్తుపై మొదట్లో అధికార పార్టీ కొంత భయపడిన మాట కూడా వాస్తవం.కానీ పొత్తు అనివార్యం అని అర్దమయిన తర్వాత దానికి ఎదుర్కొనే వ్యూహాలను కూడా సిద్దం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది .ప్రతిపక్షాల పొత్తులను చిత్తు చేయడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ఇప్పటికే పూర్తి చేసి పెట్టుకుంది .దానిలో భాగంగానే ముందుగా పెన్షన్ల మీద దృష్టి పెట్టింది.ఇప్పటికే ఈ పథకం ద్వారా కొంత ఫిక్స్డ్ ఓటు బ్యాంకు సిద్ధం చేసుకున్న జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తిస్థాయిలో సుస్థిరం చేసుకోవడం మీద దృష్టి పెట్టింది .ఇప్పటికే 27502750 రూపాయలు ఇస్తున్న పెన్షన్ జనవరి 1 2024 నుండి 3000 కి పెంచుతామంటూ జగన్ ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు.

Cm Jagan Mohan Reddy Hopes On Social Welfare Schemes Details, Cm Jagan Mohan Red

ఇప్పటికే ఈ పథకం ద్వారా 60 లక్షల మంది వృద్ధులు వికలాంగులు లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు దీన్ని 3 వేలకు పెంచడం ద్వారా వారందరి ఓట్లను గంప గుత్తగా తమ ఓటు బ్యాంకు కి మళ్ళించుకోవచ్చని జగన్ వ్యూహం. నిజంగానే అది మంచి ఆలోచన, పిల్లల ఆదరణ కోల్పోయిన వృద్ధులు ఈ పెన్షన్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ఇప్పుడు నిజంగా దాన్ని పెంచడం ద్వారా జగన్ ( CM Jagan Mohan Reddy )వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు,కచ్చితంగా వాళ్ళు జగన్కు ఓటేస్తారు.అదేవిధంగా 90 లక్షల మంది ఉన్న డ్వాక్రా మహిళలను కూడా టార్గెట్ గా పెట్టుకున్న జగన్ వారికి రుణాలు మాఫీ చేయబోతున్నారట.

Cm Jagan Mohan Reddy Hopes On Social Welfare Schemes Details, Cm Jagan Mohan Red
Advertisement
Cm Jagan Mohan Reddy Hopes On Social Welfare Schemes Details, Cm Jagan Mohan Red

అదే విధంగా పేదలకు ఇళ్ల పథకం కింద ఇప్పటికే 30 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు సమాచారం ఏ విధంగా చూసినా దాదాపు కోటిన్నర మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిందని వాళ్లందరూ ఎన్ని రకాల ప్రలోభాలకు ప్రతిపక్షాలు గురిచేసిన కూడా జగన్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేస్తారని నమ్మకం జగన్లో ఈ ధైర్యాన్ని పెంచిందని చెప్పాలి.అంటే కాకుండా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పేరుతో ఒక అనదికార కార్యకర్త ఉన్నారు కాబట్టే జగన్ అంతా దైర్యం గా ఉన్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా రాష్ట్రం ఎంత ఆర్థికంగా అధోగతి పాలైనప్పటికీ తమకు జరుగుతున్న వ్యక్తిగత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్లో పాల్గొంటున్న సామాన్య జనం అధికం కాబట్టి జగన్ వ్యూహం కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు