జగన్ గుజరాత్ స్ట్రాటజీ.. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్స్!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏడోసారి విజయభేరి మోగించింది.

 మోడీపై ఉన్న క్రేజ్, బలహీనమైన ప్రత్యర్థులు, కనిపించే అభివృద్ధి ఇలా అనేక అంశాలు ఈ విజయానికి దోహదపడ్డాయి.

 రాష్ట్రంలో భాజపా ఓడిపోయి ఉంటే మోడీకి అది సొంత రాష్ట్రం కాబట్టి పెద్ద షాక్‌గా ఉండేది. అయితే గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించడం ఆ పార్టీ పెద్ద బూస్ట్ అనే చేప్పాలి.

 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ తరహా వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.గుజరాత్ ఎన్నికల్లో దాదాపు 48 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కలేదు.

  ఈ జాబితాలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. కొందరు రెబల్స్‌గా పోటీ చేసినా ఫలితం లేకపోయింది.

Advertisement

 మోదీ, షాల నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టారు.అయితే అదే స్ట్రాటజీ ని వైసీపీ ఫాలో కానున్నట్లు  తెలుస్తుంది.

  అయితే ఏపీలో స్ట్రాటజీ వర్కౌవుట్ అవుతుందా? గుజరాత్‌ల కాకుండా ఏపీలో  బలమైన  ప్రతిపక్షం  ఉంది.అయితే ఓటర్లు తమవైపే  ఉన్నారని వైఎస్సార్‌సీపీ గట్టిగా నమ్ముతోంది.

  ఈ నమ్మకంలో నిజమెంతో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఈ స్ట్రాటజనే ఫాలో అవ్వాలని చూస్తున్నారు.

దీని కోసం అభ్యర్థులపై సీరియస్‌గా పని చేయనున్నారు. 

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

రెండో ఆలోచన లేకుండా కొందరు అనర్హుల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రి అభ్యర్థులకు కూడా టిక్కెట్ ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నారు.మరీ ప్రయత్నంతో వైసీపీ గెలుపు సాధ్యమవుతుందా? లేదో చూడాలి.ఇన్‌సైడ్ రిపోర్టుల ఆధారంగా మీడియా సర్కిల్స్‌లో అధారంగా దాదాపు 40 మందికి టికెట్స్ రావని తెలుస్తుంది.

Advertisement

ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కఠినంగా వ్యవహరించబోతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.తమ నియోజకవర్గాల నుంచి అఖండ మెజారిటీతో గెలుపొందిన నేతలకు కూడా 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కదని లేదని తెలుస్తుంది.

తాజా వార్తలు