మరో విమానంలో ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్..!!

సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 05:03 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ బయలుదేరడం తెలిసిందే.అయితే బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం రావడంతో మళ్లీ 05:26 నిమిషాలకు తిరిగి వచ్చేసారు.

కాగా ఇప్పుడు మరొక ప్రత్యేకమైన విమానంలో తిరిగి ఢిల్లీ బయలుదేరడం జరిగింది.

రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సన్నాహక సదస్సులో భాగంగా కార్టెన్ రైజర్ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరు కానున్నారు.

Cm Jagan Left For Delhi In Another Flight , Cm Jagan, Delhi Tour, Osd P. Krishna

ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే రీతిలో వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.సీఎం వెంట సిఎస్ జవహర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, సిఎస్ఓ చిదానంద రెడ్డి ఉన్నారు.ఈరోజు రాత్రి జనపద్ నివాసంలో సీఎం జగన్ బస చేయనున్నారు.

మంగళవారం ఉదయం 10:30 నుంచి 5:30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో రాయబారులు మరియు పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.ఇదిలా ఉంటే సాయంత్రం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం.

Advertisement
CM Jagan Left For Delhi In Another Flight , CM Jagan, Delhi Tour, OSD P. Krishna

  ఇందుకు గాను ప్రత్యేక దర్యాప్తు కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ పరిణామంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో హైదరాబాదు నుండి ప్రత్యేక విమానం రావటంతో జగన్ తిరిగి ఢిల్లీ పర్యటనకీ పయనమయ్యారు.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు