ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీఎం జగన్ ఫైర్

ఆక్వా రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపుపై ఆయనకు రైతులు ఫిర్యాదు చేశారు.

వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ధరలు పతనమై నష్టపోతున్నామని ఆక్వా రైతులు వాపోయారు.

ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారు.రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.

దీనిపై విచారణకు ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు సీఎం జగన్.అనంతరం ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందించాలని తెలిపారు.

Advertisement

ఆ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కాగా, ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సిదిరి అప్పలరాజుతో పాటు సీఎస్, కమిటీలో సీనియర్ అధికారులు విజయానంద్, మాలకొండయ్య, కన్నబాబు ఉన్నారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement