CM Jagan Childrens Day: బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చదువు విషయంలో సీఎం జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

పిల్లలకు ప్రభుత్వాలు లేదా తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువు అని చాలా సందర్భాలలో తెలియజేశారు.

అయితే వారి కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండేలా ఆశించడమే అని చాలా సందర్భాలలో పేర్కొన్నారు.ఈ క్రమంలో చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా అనేక పథకాలు కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద.ఇంకా స్కూలు రూపురేఖలు మారే విధంగా "నాడు నేడు" ద్వారా.

అనేక సదుపాయాలు కల్పించడం జరిగింది.ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం కూడా తీసుకొచ్చారు.

Advertisement

అయితే నేడు బాలల దినోత్సవం నేపథ్యంలో సీఎం జగన్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు."చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి.

సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు.ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి.

చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

తాజా వార్తలు