ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మనవడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కుమారుడు నారా దేవాన్ష్ (Nara Devansh)తన ప్రతిభతో ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
దేవాన్ష్ ‘‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్’’ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను పొందాడు.
‘‘చెక్‌మేట్ మారథాన్’’(Checkmate Marathon) పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో దేవాన్ష్ అద్భుతమైన వ్యూహాత్మక ప్రదర్శన కనబర్చాడు.క్రమపద్ధతిలో సవాలు చేసే 175 చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించడంలో దేవాన్ష్ ప్రావీణ్యాన్ని చాటాడు.
చెస్ కోచ్ మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం దేవాన్ష్‌ను ఈ ఘనత సాధించడానికి దోహదపడినట్టు నారా కుటుంబం తెలిపింది.దేవాన్ష్ ఈ ఘనతతోనే ఆగిపోలేదు.
మరో రెండు విశేషమైన ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు." 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయి " ("7 Disc Tower of Hanoi")ఈ క్లిష్టమైన సమస్యను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పరిష్కరించాడు.
అలాగే " 9 చెస్ బోర్డ్‌ల అమరిక " లో మొత్తం 32 చెస్ ముక్కలను కేవలం 5 నిమిషాల్లో సరైన స్థానాల్లో అమర్చి తన వేగవంతమైన ప్రావీణ్యాన్ని నిరూపించాడు.తనయుడు విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను.అతని విజయాల్లో రాయ్ చెస్ అకాడమీ కీలక పాత్ర పోషించింది.
భారత చెస్ చరిత్రలో ఈ తరహా ఘనతలు చరిత్రాత్మకమైనవని లోకేష్ అన్నారు.
ఇక ఈ సందర్బంగా దేవాన్ష్ కోచ్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ‘దేవాన్ష్ ఒక డైనమిక్ విద్యార్థి.175 సంక్లిష్టమైన పజిల్స్‌ను ఆసక్తితో పరిష్కరించడం మానసిక చురుకుదనానికి నిదర్శనం.ఇది అతని చదరంగం ప్రయాణంలో ఒక మైలురాయని అభిప్రాయపడ్డారు.
దేవాన్ష్ క్రీడాభిరుచి, వ్యూహాత్మక ఆలోచనలతో చెస్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy