ఆ విధంగా బీఆర్ఎస్ కు మేలు చేస్తోన్న చంద్రబాబు 

తెలంగాణలో అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్( BRS ) ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,  కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో ( Congress ) చేరిపోతున్నారు.

దీంతో బీఆర్ఎస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే మారింది. పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటూ పార్టీని కష్టాల్లో వదిలి వెళ్ళిపోతున్నారు.

  ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉండడంతో,  ఆ పార్టీలోనే ఎక్కువమంది బీఆర్ఎస్ నేతలు చేరిపోతున్నారు.

ఈ చేరికల పరంపర కొనసాగుతుండగానే టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలియకుండానే బీఆర్ఎస్ కు మేలు చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఏపీలో టిడిపి( TDP ) అధికారంలో ఉండడంతో తెలంగాణలోను పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు( Chandrababu ) నిర్ణయించుకోవడంతో పాటు , తెలంగాణ టిడిపి నాయకులతోను సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే విషయంపై ఫోకస్ చేశారు.

Advertisement

కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబుకు పెద్ద ఎత్తున హోర్డింగ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని వదిలించుకున్నా.

  ఇంకా వెంటపడుతూ ఉండడం ఏంటంటూ సోషల్ మీడియాలో తెలంగాణ యువకులు కామెంట్స్ చేయడం తదితర పరిణామాలతో చంద్రబాబు హార్డింగ్స్,  ఫ్లెక్సీలను ఆ తరువాత కొంతమంది తొలగించారు.  అలాగే బీఆర్ఎస్ కు చెందిన నేతలు చంద్రబాబును హైదరాబాదులో( Hyderabad ) కలవడమూ  రాజకీయంగా చర్చనీయాంశం అయింది.

ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నా.ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.అయితే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును కలవడం పైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,( MLA Prakash Goud )  అరికెపూడి గాంధీ తో( Arikepudi Gandhi ) పాటు,  మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా చంద్రబాబును కలిశారు.ఈ పరిణామాలన్నీ అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి.తెలంగాణలో టిడిపి మళ్లీ బలోపేతం అయితే ఆంధ్ర పెత్తనం మొదలవుతుందనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు.

కాలినడకన తిరుమలకు వెళ్లిన నాని.. ఈ స్టార్ హీరో భక్తికి ఫిదా అవ్వాల్సిందే!
కార్పొరేట్ జలగల రిమోట్ ప్రభుత్వం ... షర్మిల తీవ్ర విమర్శలు

దీనికి తగ్గట్లుగానే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కావడం వంటివన్నీ బీఆర్ఎస్ కు ఇప్పుడు కలిసి వస్తున్నాయి.తెలంగాణలో టిడిపిని ఎంత వేగంగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే అది అంతగా బీఆర్ఎస్ కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు