పంజాబ్‎లో ‘కంటి వెలుగు’ అమలు చేస్తాం.. సీఎం భగవంత్ మాన్ స్పష్టం

తెలంగాణ తరహాలోనే పంజాబ్‎లోనూ ‘కంటి వెలుగు’ పథకాన్ని తీసుకువస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు.

మంచి జరిగితే అభినందిచాలన్న ఆయన కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

అనంతరం బీజేపీపై తీవ్ర స్థాయిలో సీఎం భగవంత్ మాన్ ధ్వజమెత్తారు.దేశాన్ని బీజేపీ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.

ఈ దేశం విద్వేశాలకు వేదిక కాకూడదని చెప్పారు.ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదన్న ఆయన దోపిడీ రాజ్యం నడుస్తోందని విమర్శించారు.

దేశంలో అన్నింటినీ బీజేపీ అమ్మేసిందన్నారు.దొడ్డిదారిన బీజేపీ అధికారంలోకి రావడంలో నెంబర్ వన్ అని వెల్లడించారు.

Advertisement

బీజేపీయేతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కేంద్రం పని చేయనివ్వడం లేదని పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మార్పు కోసం బీఆర్ఎస్ తొలి అడుగు వేసిందని కొనియాడారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు