ఛత్తీస్‎గఢ్‎లో జవాన్లు, మావోల మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‎గఢ్‎ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొగుండాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.సీఆర్పీఎఫ్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు.

ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరపగా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.మరి కొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది.కాగా మావోయిస్టుల మృతిని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు