ఎమ్మెల్సీ క‌విత కేసులో సిటీ సివిల్ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఎమ్మెల్సీ క‌వితపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ వ్య‌వ‌హారంలో క‌విత‌కు సంబంధించి ఎవ‌రూ ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని ఆదేశించింది.

సామాజిక మాధ్య‌మాల్లోనూ క‌విత‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.ఈ క్ర‌మంలో బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే సిర్సాల‌కు న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది.

అనంత‌రం విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 13 కు వాయిదా వేసింది.ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌వితతో పాటు కేసీఆర్ కుటుంబం ప్ర‌మేయం ఉందంటూ బీజేపీ నేత‌లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు