వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై టీడీపీ కార్య‌క‌ర్త వెంగ‌ళ‌రావుకు సీఐడీ బెయిల్

యూట్యూబ‌ర్, టీడీపీ కార్య‌క‌ర్త వెంగ‌ళ‌రావుకు వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై సీఐడీ బెయిల్ మంజూరు చేసింది.ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అస‌త్య ప్ర‌చారాలు చేస్తూ.

సామాజిక మాధ్య‌మాల్లో వీడియోలు పెట్టార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.మ‌రోవైపు, క‌స్ట‌డీలో భాగంగా సీఐడీ అధికారులు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని నిందితుడు వెంగ‌ళ‌రావు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో గుంటూరు జీజీహెచ్ లో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం.తిరిగి సీఐడీ కోర్టులో హాజ‌రుప‌రిచారు.వెంగ‌ళ‌రావు రిమాండ్ కు సంబంధించి సీఐడీ స‌మ‌ర్పించిన రిమాండ్ రిపోర్టును న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది.41 సీఆర్పీసీ కింద నిందితునికి నోటీసులు ఇవ్వ‌లేద‌న్న న్యాయ‌మూర్తి.నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగే అరెస్టుల్లో రిమాండ్ రిపోర్టును అంగీక‌రించేది లేద‌న్నారు.

అనంత‌రం వెంగ‌ళ‌రావుకు వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేశారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023