మీకు క్రిస్మస్ తాత అసలు కథ గురించి తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్మస్( Christmas ) అంటే చిన్నారులకు ఎంతో ఇష్టమని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏం ఇష్టమో వాటిని ఈ పండుగ రోజు బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.

క్రిస్మస్ తాత శాంటా క్లాస్( Santa Claus ) వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్ళాడని పిల్లలకి చెబుతూ ఉంటారు.ఈ బహుమతులు ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్మస్ సందర్భంగా బహుమతులు ఇవ్వడం అనేది విదేశాలలో మొదలైన ట్రెండ్ అని చెప్పవచ్చు.క్రిస్మస్ కి ముందు పిల్లలు తమకు కావాల్సిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు.

అందులో ఏదో ఒకటి పిల్లలకు ఇస్తూ ఉంటారు.పిల్లలు మాత్రం ఆ గిఫ్టులు( Gifts ) క్రిస్మస్ తాత ఇచ్చాడని ఆనందపడుతూ ఉంటారు.అసలు ఈ క్రిస్మస్ తాత ఏలా పుట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఒక ధనిక వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు.కాలక్షేపం కోసం రోజు సాయంత్రం అలా బయటకు వెళ్లేవాడు.

అలా వెళ్తున్న సమయంలో వీధిలో రోడ్డు పక్కన సరైన దుస్తులు కూడా లేకుండా ఆకలితో అలమటించి పోతున్న ఒక కుటుంబాన్ని చూసి చలించిపోయాడు.వారికి సహాయం చేయాలని భావించిన ఆ ధనికుడు( Rich Man ) రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో రహస్యంగా వెళ్లి దుప్పట్లు కొంత డబ్బుతో పాటు పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు కూడా అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో ఆయన తలకు టోపీ, కోర్టు ధరించి చేతిలో కర్రతో ఉన్నట్లు అక్కడ ఉన్నవారు గమనించారు.ఆ రోజు క్రిస్మస్ కావడంతో దేవుడే క్రిస్మస్ తాత ను పంపించాడని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు.అప్పటినుంచి క్రిస్మస్ సమయంలో పేదలకు సహాయం చేయడం పిల్లలకు బహుమతులు ఇవ్వడం మొదలైందని చెబుతున్నారు.

అలాగే ఇంకా చాలా కథలు క్రిస్మస్ తాత గురించి ప్రచారంలో ఉన్నాయి.

కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!
Advertisement

తాజా వార్తలు