అడ్వాన్స్ బుకింగ్ లో వాల్తేరు వీరయ్య వర్సెస్ వీర సింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా లు ఈ సంక్రాంతి కి ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల యొక్క అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి.

ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో ఈ రెండు సినిమా ల యొక్క అడ్వాన్స్ బుకింగ్ భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.వీర సింహా రెడ్డి అక్కడ పై చేయి సాధించాడు అంటూ ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాల యొక్క అడ్వాన్స్ బుకింగ్ నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నాయి.

ప్రతి చోటా కూడా హోరా హోరీ గా ఉన్నట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదైనట్లుగా తెలుస్తుంది.ఇక సినిమా విడుదల రోజు ముందు రోజు మరో లెవెల్ అన్నట్లుగా వసూళ్లు ఉండబోతున్నాయి.

Advertisement

రేపు వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆ తర్వాత రోజే వాల్తేరు వేరే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ రెండు సినిమా ల కూడా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా భారీ కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఈ రెండు సినిమా లు భారీ వసూళ్లను సొంతం చేసుకుంటే ఖచ్చితం గా సంక్రాంతి కి ప్రేక్షకులకు పండగే.ఈ రెండు సినిమా ల్లో కూడా ముద్దుగుమ్మ శృతి హాసన్‌ నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

రెండు సినిమా లకు చాలా కామన్ పాయింట్స్ ఉండటంతో రెండు సినిమా లు కూడా ఖచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు