Chiranjeevi Alluda Majaka : అత్తతో రొమాన్స్ ఏంటి అంటూ చిరంజీవిని ఏకి పారేసిన తెలుగు ప్రేక్షకులు

చిరంజీవి.ప్రాణం ఖరీదు సినిమా తో హిట్ అందుకొని ఖైదీ వంటి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు.

ఇక అక్కడ నుంచి ఒక పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీ లో ఏక చక్రాధిపత్యం చేసాడు.ఒక వైపు ఎన్టీఆర్, అక్కినేని , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి హీరోలు సీనియర్స్ కావడం వారంతా ఒకరి తర్వాత ఒకరు నంబర్ వన్ స్థానం నుంచి వైదొలగడం చిరంజీవికి బాగా కలిసి వచ్చింది.

ఇక తన సినిమాలతో టాలీవుడ్ పై దశాబ్దం పాటు దండయాత్ర చేసి చాలా ఫాలోయింగ్ పెంచుకొని టాలీవుడ్ మెగా స్టార్ గా అవతరించాడు.అప్పటికే అల్లు వారి అల్లుడు కావడం కూడా చిరంజీవికి బాగా కలిసి వచ్చింది.

Chiranjeevi Rejected By Tollywood Audience , Chiranjeevi , Alluda Majaka,prana

ఎంత వెలుగుతున్న సూర్యిడికైనా కూడా గ్రహణం పడుతుంది.అలాంటి పరిస్థితి ఒకసారి చిరంజీవి కి వచ్చింది.అతడు నటించిన బిగ్ బాస్, రిక్షావోడు, ముఠా మేస్త్రి వంటి భారీ సినిమాలు ఒక్కొక్కటిగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

Advertisement
Chiranjeevi Rejected By Tollywood Audience , Chiranjeevi , Alluda Majaka,Prana

అదే సమయంలో తనను మించి కొత్త హీరోలు ఎక్కడ పైకి ఎదిగిపోతారో అనే భయం ఒక వైపు మరో వైపు మంచి కథ దొరక్క చేస్తున్న సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ అతడిని ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి.అదే సమయం లో ఏకంగా ఏడాది పాటు ఏ సినిమాకు కూడా ఒప్పుకోలేదు.

ఎలాంటి సినిమా తీయాలో పాలుపోని పరిస్థితి.అప్పుడే వచ్చిన సినిమా అల్లుడా మజాకా.

ఈ సినిమా కాస్త పర్వాలేదు అని అనిపించినా చిరంజీవిని కాంట్రవర్సీలు చుట్టూ ముట్టాయి.

Chiranjeevi Rejected By Tollywood Audience , Chiranjeevi , Alluda Majaka,prana

ఈ సినిమాలో రమ్య కృష్ణ, రంభ హీరోయిన్స్ గా నటించగా, అత్త పాత్రలో పాత హీరోయిన్ లక్ష్మి నటించింది.అయితే అత్తను ఆటాడించే పాత్రలో చిరంజీవి నటించగా ఆమెతో క్లోజ్ గా మూవ్ అయ్యే కొన్ని సన్నివేశాలు అలాగే సరదాలు , సరసాలు వంటి కొన్ని సీన్స్ ఉండటం తో తెలుగు రాష్ట్రము ఉలిక్కిపడింది.అత్తా తో అల్లుడి రొమాన్స్ నచ్చకపోవడం తో చిరంజీవి ప్రతిష్ట కు చెడ్డ పేరు వచ్చిందనే చెప్పాలి.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

మరి ఇలాంటి టైం లో ఏం చేయాలో తెలియక మమ్మోట్టి తీసిన సినిమాను తెలుగు లో హిట్లర్ పేరుతో రీమేక్ చేసి మళ్లి విజయాల బాట పట్టాడు చిరంజీవి.

Advertisement

తాజా వార్తలు