సర్దార్ సెట్ లో మెగాస్టార్

నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయం.హైదరాబాద్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్.

అనుకోకుండా ఆయన అడుగు పడింది.అంతే యూనిట్ మొత్తం పవర్ స్టార్ ని వదిలేసి ఆయనవైపే చూస్తున్నారు.

పవర్ స్టార్ ని కాకుండా వేరే ఓవరినో చూస్తున్నారంటే ఆయన ఇంకెవరై ఉంటారు? అక్కడ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి.నిన్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ తిలకించడానికి వచ్చారు.

అరగంట , గంట కాదు, సగం రోజు అక్కడే ఉన్నారు.

Advertisement
తమ్ముడితో ఏం ముచ్చటించాతో తెలియదు కాని, యూనిట్ వాళ్లతో ఆత్మీయంగా మాట్లాడరంటా.

అప్పుడు దర్శకుడు ఎస్ జే సూర్య కూడా అక్కడే ఉన్నారు.సూర్యతో కాసేపు పవన్ తదుపరి సినిమా విశేషాలు తెలుసుకున్నారంటా.

జల్సా తరువాత పవన్ సినిమా సెట్లోకి చిరంజీవి రావడం ఇదే మొదటిసారి.

ఈ నెలాఖరు వరకు జరిగే హైదరాబాద్ షెడ్యుల్ తో సినిమా చాలావరకు పూర్తయిపోతుందని సమాచారం.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

అంతా అనుకున్నట్టె జరిగితే ఏప్రిల్ 8నే గబ్బరోడు మరోసారి తన తిక్క చూపిస్తాడు.

Advertisement

తాజా వార్తలు