'మెగా 157'పై క్రేజీ అప్డేట్.. ఇందులో నలుగురు ఉండబోతున్నారా?

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుసగా డైరెక్టర్లకు కమిట్మెంట్స్ ఇస్తూ వాటిని ఒకదాని తర్వాత మరొక పూర్తి చేస్తూ పోతున్నాడు.

ఇక ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.ఇది రీమేక్ సినిమా కావడంతో ముందు నుండి అంచనాలు భారీగా లేకపోవడంతో ప్లాప్ అయ్యింది.

మెగాస్టార్ కెరీర్ లోనే అట్టర్ ప్లాప్ గా నిలిచి పోవడంతో ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.మొన్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ప్రకటించిన రెండు సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలే కావడంతో ఇప్పుడు మెగాస్టార్ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

మరి మెగాస్టార్ ఇటీవలే ప్రకటించిన సినిమాల్లో మెగా 157 ( Mega157 ) ఒకటి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ( UV Creations ) వారు భారీ స్థాయిలో నిర్మించనుండగా బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో షూట్ స్టార్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

Advertisement

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి ( Anushka Shetty )ని ఫిక్స్ చేసినట్టు టాక్ వచ్చింది.

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ రాగా దీని ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు లేదంటే నలుగురు హీరోయిన్స్ నటించే అవకాశం ఉన్నట్టు అంటున్నారు.మరి ఆ హీరోయిన్స్ ఎవరో ముందు ముందు తెలియనుంది.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ రోల్ కూడా పవర్ఫుల్ గా ఉండనుందని ఆద్యంతం ఆకట్టుకునేలా మెగాస్టార్ రోల్ ను వసిష్ఠ తీర్చిదిద్ద బోతున్నాడని సమాచారం.ఫాస్ట్ గా షూట్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.

చోటా కే నాయుడు ఫొటోగ్రఫీ అందించనున్నారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు