మెగా - మారుతి కాంబో సినిమాపై లేటెస్ట్ అప్డేట్.. అలా ఉండబోతుందట!

మారుతీ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ అయ్యి మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా అయిన వెంటనే చిరంజీవితో తన సినిమా ఉండబోతుందని టాక్ వచ్చింది.అయితే ఆ తర్వాత ప్రభాస్ సినిమా మధ్యలోకి వచ్చింది.

ప్రభాస్ తో మినిమమ్ బడ్జెట్ తో ఒక హర్రర్ సినిమా ప్లాన్ చేసినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

దీంతో వీరి కాంబోలో సినిమా అసలు ఉంటుందో లేదో.ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు.

Advertisement

దీంతో మారుతి మళ్ళీ మెగాస్టార్ సినిమానే నమ్ముకున్నట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.చిరు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తి అయినా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇక మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి.ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్.

అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.అలాగే ఛలో, భీష్మ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల కు కూడా మెగాస్టార్ ఓకే చెప్పాడు.

  మరి ఈ సినిమాలలో గాడ్ ఫాథర్, భోళా శంకర్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్ లు తర్వాత మారుతి కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

మరి మళ్ళీ ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.తాజాగా ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుంది.ఎలాంటి కథతో రాబోతున్నాడు అనే విషయం బయటకు వచ్చింది.

Advertisement

చిరు ఈ సినిమాను పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రెడీ చేయాలని కోరారట.చిరు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఈ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా చేయక పోవడంతో మారుతి ని అలా కోరారట.

మారుతి కూడా చిరు చెప్పినట్టుగా స్క్రిప్ట్ రెడీ చేసారని ఇది మెగా ఫ్యాన్స్ ను కూడా ఖచ్చితంగా మెప్పిస్తుందని టాక్ వినిపిస్తుంది.