టాలీవుడ్ లో ఒక్కరే బాస్... చిరంజీవిపై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు( Dil Raju ) ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే థియేటర్లను ముస్తాబు చేస్తున్నారు.

ఈ సందర్భంగా విజయవాడలో రామ్ చరణ్( Ram Charan ) భారీ కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.సుమారు 256 అడుగుల చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు.

అయితే ఇప్పటివరకు అత్యంత ఎత్తైన కటౌట్ ఇదే కావటం విశేషం.

Advertisement

ఇలా రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో ఈ విషయం గురించి దిల్ రాజు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.గత కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ ప్రముఖులు చిరంజీవి( Chiranjeevi ) గారిని బాస్( Boss ) అనే పిలుస్తారు.ఇక ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో చిరంజీవి గారే బాస్ అనే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

గత 45 సంవత్సరాలుగా చిరంజీవి గారిని ఆదరించే సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఆయనని తీసుకెళ్లిన అభిమానులు మీరు.మీరు మామూలు అభిమానులు కాదు సినీ ఇండస్ట్రీకి ఆయన మహావృక్షం లాంటివారు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే.

చిరంజీవి గారు ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమందిని ఇండస్ట్రీకి అందించారు.చిరంజీవిగారికి తోడుగా ఉండి రామ్ చరణ్ కు నేడు 256 అడుగుల ప్రపంచ రికార్డు సాధించే విధంగా కటౌట్ స్థాపించి మీ అభిమానం చూపడం ఎంతైనా అభినందనీయమని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.శంకర్ డైరెక్షన్లో రాంచరణ్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?
Advertisement

తాజా వార్తలు