పోయింది, స్టేట్ రౌడీ పోయింది.. అల్లు రామలింగయ్యపై కన్నెర్ర చేసిన చిరు..?

1989లో వచ్చిన స్టేట్ రౌడీ సినిమా( State Rowdy Movie ) సూపర్ హిట్ అయింది.ఈ సినిమాను దర్శకుడు బి.

గోపాల్ తెరకెక్కించారు.మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా నటించాడు.

రాధ, భానుప్రియ హీరోయిన్లుగా అలరించారు.ఈ సినిమాకు బప్పీ లహరి సంగీతం అందించాడు.1989, మార్చి 23న ఈ సినిమా విడుదలైంది.ఆ సమయంలోనే ఈ సినిమా ఏకంగా రూ.1 కోటి వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది."స్టేట్ రౌడీ" మూవీ తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది.

ఇందులోని పాటలు ఉర్రూతలూగించాయి."సండే అననురా" పాట ఎవర్‌గ్రీన్ హిట్ అయింది.

Advertisement
Chiru Fires On Allu Ramalingaiah Details, State Rowdy Movie, Megastar Chiranjeev

ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్టోరీ, డైలాగ్స్ అందించారు.అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) ఈ మూవీ సమయంలో అల్లు రామలింగయ్య, చిరంజీవి మధ్య చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు.

Chiru Fires On Allu Ramalingaiah Details, State Rowdy Movie, Megastar Chiranjeev

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "ఒకరోజు బాబాయ్ అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) షూటింగ్ కి వస్తూనే పోయింది, స్టేట్ రౌడీ పోయింది అని అంటున్నారు.అప్పుడు అది విని నేను షాక్ అయ్యా.ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ అని ప్రశ్నించా కూడా.

పోయింది, చెప్తున్న కదా నేను అని ఆయన రిప్లై ఇచ్చారు.ఆ మాటలు విన్న చిరంజీవి తెల్లబోయారు.

ఇదేంటి మామయ్య ఇలా అంటున్నారు అని షాక్ అయ్యారు.కరెక్ట్ గా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ సినిమా తీసిన సారథి స్టూడియోస్ ఓనర్ శశి భూషణ్ కుమార్ అక్కడికి వచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

తర్వాత ఫస్ట్ వీక్ స్టేట్ రౌడీ సినిమా ఎంత గొప్పగా డబ్బులు కలెక్ట్ చేసిందో చెప్పారు.

Chiru Fires On Allu Ramalingaiah Details, State Rowdy Movie, Megastar Chiranjeev
Advertisement

అవన్నీ విన్న తర్వాత చిరంజీవి గారు ఒక సైడ్ గా అల్లు రామలింగయ్య వైపు భలేగా చూశారు.దాంతో అల్లు రామలింగయ్య నాకేం తెలుసు ఎవరో చెప్పారు నేను ఇక్కడ చెప్పాను అంటూ సమర్ధించుకున్నారు.ఆ సంఘటన చూసి బాగా నవ్వు వచ్చేసింది.

" అని పరుచూరి కృష్ణమూర్తి గోపాలకృష్ణ తెలిపారు.ఈ సినిమాలో "రాధా రాధ మదిలోన," "చుక్కల పల్లకిలో," "ఒకటి రెండు మూడు నాలుగు," "అరె మూతి మీద మీసమున్నా" వంటి పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి.

ఈ సినిమా తో చిరు రేంజ్ ఒక మెట్టు ఎదిగారు.

తాజా వార్తలు