థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?

ఈ మధ్య కాలంలో థమన్( Thaman ) తన మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో థమన్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

అయితే థమన్ తాజాగా డాకు మహారాజ్ మూవీ ( Daku Maharaj movie )సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ సరదాగా ఉండే థమన్ తాజాగా ఎమోషనల్ అయిపోయాడు.

ట్రోల్స్, నెగిటివ్ కామెంట్ల గురించి తన మనసులో ఉన్న ఆవేదనను థమన్ బయటపెట్టగా ఆయన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.థమన్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ వీడియో గురించి చిరంజీవి ( Chiranjeevi )రియాక్ట్ కావడం జరిగింది.

నిన్న నువ్వు మట్లాడిన మాటలు నా హృదయాన్ని తాకేలా ఉన్నాయని ఆయన అన్నారు.

Chiranjeevi Emotional Comments About Thaman Details Inside Goes Viral In Social
Advertisement
Chiranjeevi Emotional Comments About Thaman Details Inside Goes Viral In Social

ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదనను చూసి నాకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించిందని థమన్ పేర్కొన్నారు.కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో కదా అని థమన్ చెప్పుకొచ్చారు.మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన లైఫ్ ను కూడా ముందుకు నడిపిస్తుందని థమన్ వెల్లడించారు.

Chiranjeevi Emotional Comments About Thaman Details Inside Goes Viral In Social

అయితే గేమ్ ఛేంజర్ సినిమా( game changer movie ) విషయంలో జరిగిన నెగిటివ్ పబ్లిసిటీ థమన్ ను బాధ పెట్టిందని తెలుస్తోంది.థమన్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు ఇస్తాడేమో చూడాల్సి ఉంది.బాలయ్య తర్వాత సినిమాలకు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతారేమో చూడాల్సి ఉంది.

థమన్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.థమన్ తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటూ ఉండటం గమనార్హం.

ఆ మూవీ సెట్స్ లో అందరికీ టార్చర్ చూపించాను.. థమన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు