ప్రజారాజ్యం రూపాంతరమే జనసేన.... చిరంజీవి సంచలన వ్యాఖ్యలు?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తాజాగా హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen ) నటించిన లైలా ( Laila ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ( Prajarajyam Party ) జనసేన ( Janasena ) పార్టీ గురించి మాట్లాడటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే .ఇలా పార్టీని స్థాపించిన ఈయన అనంతరం ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి కలిపేసి తిరిగి సినిమాలపై ఫోకస్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలో భాగంగా చిరు కరాటే రాజు అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.ఆయన 17 ఏళ్ల క్రితం తనతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేశారన్నారు చిరంజీవి.ఆ తర్వాత జై జనసేన అంటూ చిరు మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడ అభిమానులు కేకలు వేస్తూ గోల చేశారు.

అనంతరం జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ రూపాంతరమే జనసేన, ఈ విషయంలో ఐ యాం వెరీ హ్యాపీ అంటూ చెప్పుకు వచ్చారు.దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇలా ఈ సినిమా వేడుకలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రూపాంతరమే జనసేన అంటూ మాట్లాడటంతో కొంతమంది జనసైనికులు చిరంజీవి మాటలను స్వాగతించలేకపోతున్నారు.చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈ పది సంవత్సరాల కాలంలో పవన్ పార్టీని నిలబెట్టుకొని విజయం సాధించడం కోసం ఎన్నో కష్టాలు, అవమానాలను పడ్డారు.ఆ సమయంలో ఎప్పుడు కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రూపాంతరమే జనసేన అని చెప్పలేదు కానీ ఇప్పుడు జనసేన మంచి ఫామ్ లోకి వచ్చిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా మాట్లాడటం సరి కాదంటూ జనసైనికులు చిరంజీవి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు