ఒక్కరోజే రెండు ఈవెంట్స్‌.. మెగాస్టార్‌ జోరు మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి మొన్నటి వరకు వైజాగ్ లో తన వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అక్కడ నుండి హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి వెంటనే మహేష్ బాబు, కృష్ణ లను పరామర్శించారు.

ఆ తర్వాత గాడ్‌ ఫాదర్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలను ఇస్తున్నాడు.ఇదే సమయంలో చిరంజీవి నేడు రెండు ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.

ఇప్పటికే అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మధ్యాహ్నానికి ముంబై చేరుకొని అక్కడ నుండి సల్మాన్ ఖాన్ తో కలిసి దుబాయిలో ఒక ఈవెంట్ కి హాజరయ్యేందుకు వెళ్లబోతున్నాడు.నేడు రాత్రి దుబాయిలో భారీ గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని సమాచారం అందుతుంది.

Chiranjeevi Busy With Promotional Events And Private Events , Allu Studios,chira

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఒకే రోజు ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా ఆదర్శనీయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.యంగ్ హీరోలు ఈ తరహాలో కష్టపడేందుకు నానా ఇబ్బందులు పడతారు, ప్రమోషన్ కార్యక్రమాలు అంటే బాబోయ్ అంటూ నిట్టూరుస్తారు.కానీ మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా అంతే ఉత్సాహంతో.

Advertisement
Chiranjeevi Busy With Promotional Events And Private Events , Allu Studios,Chira

అంతే దూకుడుగా తన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇతర కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా హాజరవుతూ బిజీ బిజీగా ఉంటున్నారు.ఇలా కేవలం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌, సునీల్ ఇంకా పలువురు ముఖ్య నటీనటులు నటించారు.

సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో మొదటి రోజు పాతిక కోట్లకు పైగా వసూలు నమోదు అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు