ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం.. అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న నాగబాబు... స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరు!

జనసేన నాయకుడు నాగబాబు( Nagababu ) ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన విషయం తెలిసిందే శాసనమండలిలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ( MLC ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు ఇక కూటమిలో భాగంగా జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం రావడంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు అయితే ఈయనని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఇలా ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి నాగబాబుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు.

Chiranjeevi And Surekha Congratulate Mlc Nagababu, Nagababu, Chiranjeevi, Surekh

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సూచనలకు అనుగుణంగా నేడు బుధవారం శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.ఇలా ఈయన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన అన్నయ్య చిరంజీవి( Chiranjeevi ) దగ్గరకు వెళ్లారు.గతంలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి తన ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నాగబాబు సైతం ఎమ్మెల్సీగా తన అన్నయ్య ఇంటికి వెళ్లి తన అన్నయ్య వదిన ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Chiranjeevi And Surekha Congratulate Mlc Nagababu, Nagababu, Chiranjeevi, Surekh

ఇక చిరంజీవి సైతం తన తమ్ముడికి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు అనంతరం నాగబాబు కోసం చిరంజీవి సురేఖ ఒక ఖరీదైన పెన్నును కానుకగా అందజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి ( MLC ) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో - అన్నయ్య, వదిన అంటూ పోస్ట్ చేసారు.

Advertisement
Chiranjeevi And Surekha Congratulate Mlc Nagababu, Nagababu, Chiranjeevi, Surekh

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు జన సేన నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు