డేంజర్ బెల్స్: చైనా లో మరో కొత్తరకం వైరస్!

ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే.ఇలాంటి సమయంలో చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్నీ బయటపెట్టారు.

ఇటీవల వారు జరిపిన అధ్యయనంలో ఈ మహమ్మారిని తలపించే మరో కొత్త రకమైన స్వైన్ ఫ్లూ ను కనుగొన్నట్లు తెలుస్తుంది.దానికి సంబంధించి అమెరికా సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.G4 అని పిలువబడే ఈ వైరస్ జన్యుపరంగా H1N1 జాతి నుండి వచ్చిందని వారు అంటున్నారు.అయితే ఈ వైరస్‌ కూడా మానవులకు సోకే ప్రమాదం ఉందని.తొలిదశలోనే అరికట్టాల్సిన అవసరం ఉందని లేదంటే మరో కరోనా మహమ్మారిలా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైనీస్ వర్సిటీలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.2011 నుండి 2018 వరకు పరిశోధకులు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆసుపత్రిలోని పందుల కళేబరాల నుంచి 30,000 నాజల్ శ్వాబ్స్‌ను తీసుకుని 179 స్వైన్ ఫ్లూ వైరస్‌లను ఐసోలేట్ చేశారు.వాటిల్లో ఎక్కువ సంఖ్య కొత్త రకం వైరస్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.

Chinese Scientists Find New Flu Virus With Potential To Trigger Pandemic, Corona

ఇవన్నీ కూడా మనుషులకు సోకే ఛాన్స్ ఎక్కువగా ఉందని.వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.G4 అనేది ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి అని, ఈ వైరస్ మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఒకటి యూరోపియన్, ఆసియా పక్షులలో కనిపించే జాతుల మాదిరిగా ఉంటుందని, రెండోది 2009లో వచ్చిన సార్స్ఎం, ఇన్‌ఫ్లూఎంజా మహమ్మారికి కారణమైన H1N1 జాతి అని, మూడోది ఏవియన్, హ్యూమన్, పిగ్ ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌ల జన్యువులతో కలిగి ఉన్న ఉత్తర అమెరికా H1N1 అని తెలిపారు.

దీనికి విరుగుడు లేదని ఒకవేళ మనుషులకు సంక్రమిస్తే మిగతా ఫ్లూ వైరస్‌ల మాదిరిగా తగ్గదని స్పష్టం చేస్తున్నారు.మరి ఈ వైరస్ పై అందరూ అప్రమత్తంగా ఉండాలి అని,ఈ వైరస్ మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది అని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
వృద్ధాప్యాన్ని వాయిదా వేసే అద్భుతమైన పానీయం

తాజా వార్తలు