అమెరికా పై చైనా సంచలన వ్యాఖ్యలు.. !

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టిందనే విషయం ఇప్పటి వరకు తేలలేదు.

కానీ అమెరికాతో పాటుగా కొన్ని దేశాలు మాత్రం ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ఊపిరి పోసుకుందనే ఆరోపణలు చేస్తున్నాయి.

ఇక అమెరికా అయితే ఈ కోవిడ్ పక్కాగా చైనా నుండి వ్యాపించిందటూ ఎన్నో సార్లు డ్రాగన్ కంట్రీ పై మాటల దాడికి దిగింది.ఈ నేపథ్యంలో చైనా, అమెరికా పై ఎదురుదాడికి దిగింది.

Foreign Ministry Spokesperson Wang Wenbin Counters US On Corona Virus Origin O

అసలు కరోనా వైరస్ పుట్టింది చైనాలో కాదని, అమెరికాలో అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ అమెరికాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాగా తమపై ఆరోపణలు వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తుకు సహకరించామని, ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ నిపుణులతో దర్యాప్తుకు అమెరికా స్వచ్చంధగా ముందుకు రావాలని వెన్సిన్ సవాల్ విసిరారు.

ఇకపోతే అమెరికాకు చెందిన ఫోర్ట్ డెట్రిక్ ల్యాబొరేటరీ పై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఈ క్రమంలో కరోనా వైరస్ అక్కడే పుట్టిందని ఎందుకు అనుమానించకూడదంటూ వెల్లడించారు.ఇప్పటికే ఈ వైరస్ చైనాలో పుట్టిందనే అనుమానాలను ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్న సమయంలో చైనా ఎదురు మాటల దాడికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట.

Advertisement

ఇక తప్పు ఎవరు చేసిన ప్రపంచాన్ని మాత్రం నాశనం చేశారని తిట్టుకోని వారు లేరు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు