భారత్ విషయంలో చైనా కీలక నిర్ణయం.. !

భారతదేశ ప్రజలు తనను అసలు కేరే చేయడం లేదని భావించింది కావచ్చూ.

లేక రాజకీయ నేతలు ఈ కరోనా మమ్మల్ని ఏం చేయలేదని చంకలు గుద్దుకోవడం చూసి తన ప్రతాపాన్ని చూపడానికి తిరిగి వచ్చింది కావచ్చూ.

ఏదైతేనేమి మొత్తానికి ఈ దేశప్రజలతో ఊహించని విధంగా ఆడుకుంటుంది.ఇకపోతే అసలు కరోనాకు పుట్టిల్లు చైనా అని ఆ దేశాన్ని దుమ్మెత్తి పోయని మనిషి ఉండరు.

China Foreign Ministry Spokesperson Zhao Lijian Sensational Decision On India,Ch

ఒకగానొక సమయంలో చైనా దేశాన్ని ఒంటరిని చేసేలా మిగతా దేశాల నేతలు ప్రవర్తించారు.ఎవరు ఎంతగా నిందించిన చైనా మాత్రం కరోనా బారి నుండి త్వరగానే బయటపడింది.

ఇదే సమయంలో భారత్ మాత్రం సెకండ్ వేవ్ ఉదృతిని భయంకరంగా అనుభవిస్తుంది.ఈ నేపధ్యం లో భారత్ పై చైనాకు ప్రేమ పుట్టిందో ఏమో తెలియదు గానీ కరోనాపై భారత ప్రభుత్వం, భారతీయులు చేస్తున్న పోరాటానికి తాము అండగా నిలుస్తామని వెల్లడించింది.

Advertisement

తమ నుంచి అవసరమైన సహాయం కోసం భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నానమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ గురువారం తెలిపారు.ఏది ఏమైనా శత్రుదేశంగా భావిస్తున్న చైనా స్వయంగా సహాయం అందిస్తానని వెల్లడించడంలో ఉన్న రహస్యం ఏంటో ఎవరికి అర్ధం అవడం లేదట.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు