మొహమాటం వద్దంటూ పవన్ కు జోగయ్య హితబోధ

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టిక్కెట్ల కేటాయింపు వ్యవహారంతో నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది టిడిపి, జనసేన.

వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది .

ఇప్పటికే కొంతమంది పార్టీ కండువాలు కప్పుకోగా , మరి కొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో పాటు బలమైన తటస్థ నాయకులను పార్టీలో చేర్చుకుని , వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే విధంగా పావులు కలుపుతోంది .ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత,  మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ను( Mudragada Padmanabham ) జనసేనలో చేర్చుకునేందుకు రాయబారాలు చేశారు.దీంతో ఆయన జనసేన( Janasena ) చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ విధంగా జనసేన బలోపేతం అవుతున్న నేపథ్యంలో మరో కాపు నాయకుడు మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.

ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) తాజా రాజకీయ అంశాలపై జోగయ్య చర్చించారు.అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Advertisement

కాపు ఓటు బ్యాంకు ( Kapu Vote Bank ) చీలిపోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో సామాజిక రాజకీయ పరిస్థితులపై పవన్ కు అనేక సూచనలు చేశారు.

ముఖ్యంగా టిడిపితో సీట్ల పంపకాల విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్ళవద్దని జోగయ్య పవన్ కు సూచించారు.

అలాగే ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ రాజీ పడవద్దని , రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం దక్కేలా చేయాలని పవన్ కు హితబోధ చేశారు .కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మన సామాజిక వర్గమంతా కోరుకుంటోంది  అని, అది నిజం చేయాలని , అది జరగాలంటే సీట్ల విషయంలోనూ , ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ ఎక్కడ రాజీ పడవద్దు అని జోగయ్య పవన్ కు సూచించారట.అయితే జోగయ్య సూచనలను పవన్ ఎంతవరకూ తలకెక్కించుకుంటారో తెలియదు కానీ, ప్రస్తుతం పార్టీలోకి చేరికలు జోరందుకోవడం తో పవన్ ఖుషీగా ఉన్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు