ChatGPT ఇపుడు మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో… ఇవి గమనించారా?

ChatGPT.ఇపుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వినబడుతున్న పదం.

AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) చాట్‌బాట్‌ గురించి ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.ChatGPT సేవలను వినియోగించుకోవాలని ప్రతి టెక్ కంపెనీ కూడా అర్రులు చాస్తోంది అంటే దాని వినియోగం గురించి మీరే ఆలోచించండి.

ఆఫీస్‌, బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌, ఇతర ప్రొడక్టులకు ChatGPT సర్వీసెస్‌ను యాడ్‌ చేయడానికి మైక్రోసాఫ్ట్‌ 10 బిలియన్ల డాలర్లను చెల్లించినట్లు తాజాగా ఓ కధనం.ఇక ChatGPTకి పోటీగా Google బార్డ్‌ చాట్‌బాట్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Chatgpt Writer Extension For Google Chrome Browser

ఈ విషయాన్ని గమనించారో లేదో! ఇప్పటికే సాధారణ యూజర్లకు కూడా గూగుల్‌ క్రోమ్‌ ద్వారా ChatGPT ఇంటిగ్రేషన్ అందుబాటులోకి వచ్చేసింది.అవును.ఇపుడు మీరు మెయిల్‌లు, మెసేజ్‌లను రాయడానికి సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదు.

దానికి ChatGPT సహాయం తీసుకుంటే సరిపోతుంది.దానికి క్రోమ్‌ వినియోగదారులకు ChatGPT రైటర్ ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌కు యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది మరి.దీన్ని వివిధ భాషల్లోని అన్ని వెబ్‌సైట్‌లలో ఉపయోగించవచ్చు.ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని చాట్‌జీపీటీ ప్రొడక్టులనుచాట్‌జీపీటీ రైటర్‌ అధిగమిస్తుందని దీని మేకర్స్‌ చెబుతున్నారు.

Chatgpt Writer Extension For Google Chrome Browser
Advertisement
Chatgpt Writer Extension For Google Chrome Browser-ChatGPT ఇపుడు మ�

ఈ సేవలను పొందడానికి ముందుగా ఎక్స్‌టెన్షన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవలసి ఉంటుంది.మెసేజ్‌/మెయిల్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత.జనరేట్‌ రెస్పాన్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ChatGPTని వేగంగా, సులువుగా యాక్సెస్‌ చేసుకొనే వీలుంది.ChatGPT కన్వర్జేషన్లను ఇతరులతో పర్మనెంట్‌ లింక్స్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు.

ఇవన్నీ ఒక్క క్లిక్‌తో పూర్తి చేసేయచ్చు.క్రోమ్‌ యాప్ స్టోర్ లో ఈ ఎక్స్‌టెన్షన్‌ లభిస్తుంది.

YouTube వినియోగాన్ని కూడా ChatGPT సులభతం చేస్తోంది.ప్లాట్‌ఫారమ్‌లో వీడియోలను ఈ ఎక్స్‌టెన్షన్‌ ట్రాన్స్‌స్క్రైబ్‌ చేస్తుంది.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగితే ప్రమాదమా...

ఇంకా అనేక వినియోగాలు వున్నాయి.

Advertisement

తాజా వార్తలు