చాట్‌జిపిటి ఊపిరి పీల్చుకో... ఎలాన్ మస్క్ 'ట్రూత్ జిపిటి' వచ్చేస్తోంది!

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో చాట్‌జిపిటి( chatgpt ) సృష్టిస్తున్న ప్రభంజనాలు గురించి అందరికీ తెలిసిందే.

ఓ పక్క చాట్‌జిపిటితో గూగుల్‌ పోటీపడుతుంటే, మరోపక్క ఎదురుదాడికి సిద్ధమైపోయాడు ఎలాన్‌ మస్క్‌( Elon Musk ).

ఇకపోతే మొదటి నుంచి ఏఐతో సమాజానికి చెడు జరుగుతుందని ఆరోపణలు చేస్తున్న మస్క్‌ ఇపుడు కొత్తగా మరో ట్రూత్ జిపిటిని( Truth GPT ) తీసుకురావాలని అనుకోవడం వెనుక కథ ఏమిటి? ఆయన చాలా కాలంగా AI ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలో ఆయన ట్రూత్‌ని వినియోగదారులకు చెప్పడానికి ఓ వేదిక అవసరమని, అందుకే TruthGPT పేరుతో ఏఐ సిస్టమ్‌ను డెవలప్‌ చేస్తానని చెప్పుకు రావడం విశేషం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ సిస్టమ్‌లు ట్రూత్‌కి ప్రాధాన్యం ఇవ్వవని, అన్ని అంశాలకంటే ట్రూత్‌కి ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతోనే ట్రూత్‌జిపిటిని తీసుకువస్తున్నట్టు మస్క్ ప్రకటించారు.ట్రూత్ జిపిటితో, పూర్తిగా అన్‌బయాస్డ్‌ ఏఐ సిస్టమ్‌ను రూపొందించాలని మస్క్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఎల్లప్పుడూ ట్రూత్‌ఫుల్‌ ఇన్‌ఫర్మేషన్‌ అందించడమే లక్ష్యంగా మస్క్‌ పనిచేయనున్నారు.

ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌ గురించి ఫాక్స్ న్యూస్ ఛానెల్‌లో టక్కర్ కార్ల్‌సన్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు.

Advertisement

ఈ ఇంటర్వ్యూలో ట్రూత్‌జిపిటి అనే ఏఐని రూపొందించే ప్రణాళికలను ఎలాన్‌ మస్క్ వివరించారు.ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ట్రూత్‌ని వెతకాలని, యూనివర్స్‌ నేచర్‌ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.మానవులను సురక్షితంగా ఉంచడానికి ఈ ఏఐ ఉత్తమ మార్గం అని భావిస్తున్నారు.

ఇది ప్రజలకు ఎటువంటి హాని కలగజేయదని చెప్పుకొచ్చారు.ఏఐ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం మూడో ఆప్షన్‌ తీసుకురావాలని మస్క్ అనుకుంటున్నారు.

ప్రస్తుతం, ఏఐలో 2 పెద్ద కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ మాత్రమే పని చేస్తున్నాయి.కాగా చాట్‌జిపిటి కంటే పవర్‌ఫుల్‌ ఏఐ సిస్టమ్‌ డెవలప్‌ చేయాలనే నిర్ణయాన్ని మస్క్‌, అతని బృందం ప్రస్తుతం తీసుకున్నారు.

అయితే ఇది ఎపుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.

ఈ రాశుల వారికి పచ్చ రత్నం కలిసి రాదా..?
Advertisement

తాజా వార్తలు